![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -530 లో.....జ్యోత్స్న బట్టలు పారిజాతం సర్దుతుంది. ఏంటి గ్రానీ ఎందుకు బట్టలు ప్యాక్ చేస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడు నీ టైమ్ బాలేదు.. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు అని పారిజాతం అంటుంది. ఐడియా బాగుంది కానీ నా కంటే నువ్వు వెళ్తే బాగుటుందని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ గాడిని మర్చిపోయి హ్యాపీగా ఉండమని పారిజాతం సలహా ఇస్తుంది కానీ జ్యోత్స్న అవేం పట్టించుకోదు. మరొకవైపు దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. దీప కోపంగా ఉందని తనని కూల్ చెయ్యడానికి ట్రై చేస్తాడు.
నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు కదా అమ్మ మాట్లాడేటప్పుడు అని కార్తీక్ అంటాడు. అత్తయ్య మాట్లాడే దానికి మన దగ్గర సమాధానం ఉందా.. లేదు కదా అని దీప అంటుంది. శౌర్యపై అందరు ఎందుకు కోప్పడుతున్నారని కార్తీక్ అంటాడు. మరి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే దానికెందుకని దీప అంటుంది. శౌర్యని పీల్చుకొని వస్తాను. ఇక్కడే పడుకుంటుందని కార్తీక్ అంటాడు. అది అత్తయ్య దగ్గర పడుకుంటుందని దీప అంటుంది. మరొకవైపు కాంచనపై శౌర్య కోపంగా ఉంటుంది. ఒసేయ్ నీకు రేపు రెండు లడ్డులు ఇస్తానే అని కాంచన అంటుంది. వద్దు నేను వెళ్లి అమ్మ దగ్గర పడుకుంటానని శౌర్య అంటుంది. నువ్వు పడుకోవద్దు.. వాళ్ళు భార్యభర్తలు కదా ఒక దగ్గర ఉండాలని కాంచన అంటుంది. మరి నువ్వు తాతయ్య భార్యభర్తలు కదా ఒక దగ్గర లేరు అని శౌర్య అంటుంది. నీకు ఎందుకే అని కాంచన అంటుంది. అప్పుడే కాంచనకి పారిజాతం ఫోన్ చేసి కార్తీక్ మొదటిసారి తండ్రి కాబోతున్నాడు.. ఎవరు పుట్టాలని పారిజాతం అడుగుతుంది పాప ఉంది కదా బాబు కావాలని కాంచన అంటుంది.
ఆ పాప ఏమైనా కార్తీక్ సొంత కూతురా ఎవరికో పుట్టింది.. దానిపై ప్రేమ ఏంటని పారిజాతం అంటుంది. కొన్ని రోజుల్లో నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు.. ఆ పుట్టేవాళ్లపై ప్రేమ ఉండాలి గానీ ఆ శౌర్యపై ఎందుకు.. వెళ్లి ఎక్కడైనా ఉంచేసి రండి అని పారిజాతం చెప్తుంది. కాంచన ఆలోచనలో పడుతుంది. మరొకవైపు శౌర్య, దీప పొట్టపై కాలు తగిలుస్తుంది. అమ్మ నొప్పిగా ఉందని దీప ఏడుస్తుంది. ఏమైందని కాంచన అంటుంది. ఏం లేదని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |